Mon Nov 18 2024 18:34:47 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు ఈడీ
లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సు ఈడీ కేవియట్ పిటీషన్ వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటీషన్ వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విషయంలో ముందస్తు ఆదేశాలు ఇవ్వవద్దంటూ పిటీషన్ లో ఈడీ పేర్కొంది. తమ వాదనలను విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును ఈడీ కోరింది. ఈ నెల 24వ తేదీన కల్వకుంట్ల కవిత పిటీషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ పిటీషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపు విచారణకు...
తాను సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతనే విచారణకు హాజరవుతానని ఈ నెల 16వ తేదీన కవిత ఈడీ అధికారులకు తన న్యాయవాది ద్వారా లేఖ పంపిన సంగతి తెలిసిందే. 16వ తేదీన కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈనెల 20 వ తేదీ విచారణకు రావాలని కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
Next Story