Thu Dec 26 2024 12:46:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అందిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు నిర్వహిస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మహీపాల్ రెడ్డి గెలిచారు.
ఉదయం నుంచే...
అయితే ఏ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారన్న విషయంల మాత్రం తెలియరాలేదు. ఉదయం నుంచే బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Next Story