Sun Dec 22 2024 23:52:34 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు.. నేటితో కస్టడీ ముగిసినా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ లోని అనిల్ సోదరి అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇప్పటికే అరెస్టయి ఈడీ అధికారుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి.
నేటితో ముగియనున్న కస్టడీ...
మరోవైపు కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈడీ కస్టడీకి ఏడు రోజుల పాటు కవితను అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కస్టడీని పొడిగించాలంటూ ఈడీ అధికారులు పిటీషన్ వేసే అవకాశముందంటున్నారు. విచారణలో కవిత సహకరించకపోవడంతో మరికొన్ని రోజులు తమకు కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు. మరి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story