Thu Jan 16 2025 16:19:13 GMT+0000 (Coordinated Universal Time)
KTR : ఏడు గంటల నుంచి కేటీఆర్ ను విచారిస్తున్న ఈడీ
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు ఏడు గంటల నుంచి కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం పది గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ఆయనను విచారణ చేయడం ప్రారంభించారు. యాభై నాలుగు కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు బదిలీ చేయడంపై కేటీఆర్ ను పదే పదే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నగదును బదిలీ చేయడం చుట్టూనే ఎక్కువగా ప్రశ్నలు, ఉప ప్రశ్నలు అధికారులు వేస్తున్నట్లు తెలిసింది.
ప్రశ్నల పరంపర...
ఒప్పందం కుదరక మునుపే, ఎలాంటి మంత్రి వర్గం ఆమోదం లేకుండానే ఎందుకు నగదును బదిలీ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. నగదును పౌండ్లగా మార్చి బదలాయించాల్సిన అవసరం ఏముందని కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రేస్ నుంచి ఆ కంపెనీ ఎందుకు తప్పుకుందన్న దానిపై కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఇప్పటి వరకూ కేటీఆర్ ను విచారిస్తుండటంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కలుగుతోంది. మధ్యాహ్నం ఒక అరగంట లంచ్ బ్రేక్ మాత్రమే ఇచ్చిన అధికారులు తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు.
Next Story