Mon Dec 23 2024 05:13:04 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : నేటి నుంచి ఈడీ అధికారుల విచారణ
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నేటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నేటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. నేడు, రేపు విచారణకు హాజరు కావాలని టీఎస్ పీఎస్సీ అధికారులు ఇద్దరికి నోటీసులు ఈడీ జారీ చేసింది. అలాగే ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ ల వాంగ్మూలాల నమోదు కోసం ఈడీ అధకారులు అనుమతిని కోరారు.
అధికారులతో పాటు...
టీఎస్ పీఎస్సీ అధికారులైన శంకరలక్ష్మి, సత్యనారాయణలకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు,రేపు వారిద్దరినీ విచారించనున్నారు. రిమాండ్ లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను కూడా విచారించేందుకు అనుమతించాలని నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఈ కేసులో అరెస్టయిన14 మందిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సిట్ తమకు వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తే కోర్టు ద్వారా తెచ్చుకోవడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు
Next Story