Fri Dec 20 2024 12:08:51 GMT+0000 (Coordinated Universal Time)
కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల భర్త అనిల్ కు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల భర్త అనిల్ కు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కవిత పీఆర్వో రాజేష్ తో పాటు మరో ముగ్గురు అసిస్టెంట్లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
సోమవారం హాజరు కావాలని...
కల్వకుంట్ల కవితకు ఇప్పటికే ఏడు రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి కవితను ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత భర్తతో పాటు అసిస్టెంట్లు, పీఆర్వోకు కూడా నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో కలిపి కవిత ఎదుటే విచారించే అవకాశాలున్నాయి. నిన్న కవిత ఇంటి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టనున్నారని తెలిసింది.
Next Story