Fri Dec 20 2024 14:03:34 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఇద్దరి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఇద్దరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఇద్దరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వీరిద్దరూ కీలకంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరిద్దరిని సాయంత్రంలోగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.
మూడు రోజుల నుంచి...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మూడు రోజుల నుంచి వీరిద్దరినీ ఢిల్లీలో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతం వీరిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. వీరిద్దరూ సౌత్ నుంచి లిక్కర్ మాఫియా నుంచి వసూలు చేసి ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఈడీ చేస్తుంది.
Next Story