Sun Nov 17 2024 17:41:28 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ నోటీసులు జారీ చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు గంటలుగా బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలను నిర్వహించారు. కవిత ఇంట్లోకి ఎవరినీ రానివ్వలేదు. అందరి సెల్ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోదాల అనంతరం...
అయితే సోదాలు జరిగిన అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేశారు. కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. కవిత ఇంటివద్ద ఇప్పటికే పెద్దయెత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు మొహరించారు. అయితే పోలీసులు వారందరినీ చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కవిత నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారని తెలిసింది. ఈరోజే కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 19వ తేదీకి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత ఇంటివద్ద హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో కవితను ఢిల్లీకి తరలించే అవకాశాలున్నాయి.
Next Story