Tue Jan 07 2025 21:42:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే ఈ నెల 24వ తేదీన తాను వేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆ తర్వాతే వస్తానని కవిత ఈరోజు ఉదయం ఈడీ అధికారులను కోరిన సంగతి తెలిసిందే.
20న విచారణకు...
దీనిపై స్పందించిన ఈడీ అధికారులు కవిత విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. అయితే ఈ నెల 20వ తేదీన మాత్రం హాజరు కావాలని కోరారు. మరి కవిత 20న ఈడీ ఎదుట హాజరవుతారా? లేక న్యాయస్థానాన్ని మరోసారి ఆశ్రయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత కవిత నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story