Mon Dec 23 2024 05:46:55 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc: నేడు ఈడీ విచారణ
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులను విచారించనుంది
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులను విచారించనుంది. పెద్దయెత్తున సొమ్ములు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ అధికారులు నిందితలను విచారణ కోసం కస్టడీకి అడిగారు.
మనీలాండరింగ్....
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న రాజశేఖర్, ప్రవీణ్లను నేడు ఈడీ విచారించనుంది. మనీలాండరింగ్ కింద ఈ కేసును చేపట్టిన ఈడీ అధికారులు ఎంత డబ్బులు చేతులు మారాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడకు ఈ డబ్బును పంపిణీ చేశారు వంటి వివరాలపై నిందితులను ప్రశ్నించనుంది.
Next Story