Mon Dec 23 2024 11:26:30 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ తప్పు చేశారు.. ఈటల ఫైర్
రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా తప్పు చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా తప్పు చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈటల అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా హాజరవ్వాలని అన్నారు. కనీసం మంత్రులు కూడా పాల్గొన లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఫెడరల్ స్ఫూర్తికి.....
ప్రజస్వామ్య వాదులు బాధపడే సంఘటన ఇది అని ఈటల రాజేందర్ అన్నారు. గవర్నర్ కుర్చీని కేసీఆర్ అవమానించారని, ప్రజాస్వామ్యానికి ఇది క్షేమకరం కాదని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరించారని ఈటల రాజేందర్ మండి పడ్డారు.
Next Story