Mon Dec 23 2024 07:46:40 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణతో సంబంధం తెగిపోయినట్లే
భారత రాష్ట్ర సమితి ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
భారత రాష్ట్ర సమితి ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ పార్టీని ఖతం చేసి, ఉద్యమకారులను మరిచిపోయేటట్లు చేసి కేసీఆర్ ముద్ర ఉండేలా పార్టీని స్థాపించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధం తెగిపోయిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
డబ్బుని నమ్ముకుని....
ఆయనమద్యాన్ని, డబ్బును నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. అదే డబ్బుతో దేశంలో రాజకీయం చేయాలని కలలు కంటున్నారని అన్నారు. అది పగటి కలగానే మిగిలిపోతుందని ఈటల ఫైర్ అయ్యారు. అక్రమంగా ఇప్పటి వరకూ సంపాదించుకున్న డబ్బుతో దేశంలో చెలామణి కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్లుంది కేసీఆర్ వ్యవహారమంటూ సెటైర్ విసిరారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయని ఈటల రాజేందర్ అన్నారు.
Next Story