Thu Mar 27 2025 04:24:06 GMT+0000 (Coordinated Universal Time)
Formula E Car Rase Case : కేటీఆర్ అరెస్ట్ ఆగింది అందుకేనా?
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అందరూ భావించారు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అందరూ భావించారు. అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ లో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం పెద్దయెత్తున జరిగింది. జనవరి 16వ తేదీన కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ అధికారుల విచారణ జరిపారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5.30 గటల వరకూ విచారణ జరిపారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ లో దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ నేతలందరూ ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ లో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ అధికారి బీఎస్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు.
రాజకీయ ఆరోపణలేనా?
ఇదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అయితే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించి మరోసారి విచారణకు పిలిచినప్పుడు రావాలని జనవరి 16వ తేదీన కోరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు మళ్లీ పిలవలేదు. ఈ విషయంలో రాజకీయ మాటల యుద్ధం జరుగుతుంది. ఫార్ములా ఈ కారు రేసింగ్ కు సంబంధించిన ఫైల్స్ ఈడీ అధికారులు పట్టుకుని వెళ్లారని, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అందుకే అవినీతిని కాపాడే ప్రయత్నంచేస్తున్నారని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వల్లనేనా?
అయితే కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేసు కేసులో అదుపులోకి తీసుకోకపోవడానికి బలమైన కారణాలున్నాయని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే మరోసారి ఏసీబీ నుంచి కేటీఆర్ కు పిలుపు రావడం ఖాయమని చెబుతున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ తో బీజేపీ లబ్ది పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందేమోనని కొంత వెనక్కు తగ్గారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రేపటితో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి తిరిగి విచారణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
Next Story