Sun Dec 22 2024 23:21:25 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి రాయుడుకు ఫోన్ లో బెదిరింపులు
మాజీ క్రికెట్ అంబటి రాయుడుకు ఫోన్ లో ఆగంతకులు బెదిరింపులకు దిగారు
మాజీ క్రికెట్ అంబటి రాయుడుకు ఫోన్ లో ఆగంతకులు బెదిరింపులకు దిగారు. అంబటి రాయుడు భార్యను హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. దీంతో అంబటి రాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఐపీఎల్ లో ప్లే ఆఫ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి చెందిన తర్వాత అంబటి రాయుడు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లిపై సెటైర్లు వేశారు.
కోహ్లిపై సెటైర్లు వేసిన...
లీగ్ మ్యాచ్ లో గెలిచినంత మాత్రాన కప్పు గెలిచినంతగా సంబరాలు చేసుకోవడమేంటని సెటైర్లు వేశారు. గంతులు ఆరెంజ్ కాప్ తెచ్చిపెట్టదన్నారు. ప్లేఆఫ్ కు చేరినంత మాత్రాన కప్పు గెలిచినట్లు కాదంటూ అంబటి రాయుడు వేసిన సెటైర్లకు కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది వారిపనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది బెదిరింపులకు దిగారు.
Next Story