Thu Dec 26 2024 01:42:22 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమిపై హరీశ్ ఏమన్నారంటే?
తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐదు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు.
గ్యారంటీలతో మోసం చేసి...
తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రైతు భరోసా ఎగ్గొట్టారని, ఆసరా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయలేదన్న హరీశ్ రావు ఈ అంశాలన్నీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పుణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ ఇక్కడ చేసిన మోసాల గురించి మహారాష్ట్రలో చాలా ప్రచారం జరిగిందని తెలిసిపోతోందని అన్నారు.
Next Story