Mon Dec 23 2024 11:29:41 GMT+0000 (Coordinated Universal Time)
BRS : పారదర్శకంగానే విద్యుత్తు కొనుగోళ్లు.. బురద జల్లేందుకే
కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆలోచనలే జస్టిస్ నరసింహారెడ్డి మనసులో ఉన్నట్లున్నాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆలోచనలే జస్టిస్ నరసింహారెడ్డి మనసులో ఉన్నట్లున్నాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఛత్తీస్గడ్ తో విద్యుత్తు కొనుగోలు చట్ట ప్రకారమే జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టుల తీర్పుపై విచారణ జరిపే హక్కు కమిషన్లకు ఉండదని ఆయన తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి ముందుగానే తీర్పు ఇచ్చినట్లు మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడానికే బీహెచ్ఈఎల్ కు కాంట్రాక్టు గత ప్రభుత్వంలో ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
విద్యుత్తు కొనుగోలు...
యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు. ఉత్తారాదిన లింక్ కోసమే తాము ప్రయత్నించామని తెలిపారు. తెలంగాణలో విద్యుత్తు కష్టాలు ఉండకూడదనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికీ దేశంలో ఏ రాష్ట్రమైనా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించగలుగుతుందా? అని ప్రశ్నించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే 2014 వరకూ విద్యుత్తు ప్లాంట్ ను నిర్మించారన్నారు. విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి కనీసం ఐదేళ్లు పడుతుందన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా, వివరణ ఇవ్వడానికి సమయం కోరినా అందుకు అంగీకరించకపోవడం విచారకరమని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
Next Story