Mon Dec 23 2024 05:12:53 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే మల్లారెడ్డి
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత తలెత్దింది మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్లను మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు.
భూ వివాదంలో...
మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాదులాట జరిగింది. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తున్నారంటూ మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story