Sun Dec 22 2024 20:04:32 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ లోకి మళ్లీ నల్లాల ఓదెలు
కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నారు.
కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నల్లాల ఓదెలు దంపతులు కలిశారు. తమను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. తనకు పార్లమెంటు టిక్కెట్ కావాలని నల్లాల ఓదెలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. తాము ఈరోజు తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నామని నల్లాల ఓదెలు తెలిపారు.
చెన్నూరు నుంచి...
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కొంతకాలం క్రితం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఏర్పడిన విభేదాలతో వారు ప్రియాంక గాంధీ సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. 2009, 2014 ఎన్నికల్లో నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన కాంగ్రెస్ లో ఇమడలేక తిరిగి టీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
- Tags
- nallala odelu
- trs
Next Story