Fri Nov 22 2024 19:47:45 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు మొనగాడు ఎవరంటే.. ఎగ్జిట్ పోల్స్ ఇలా
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. పల్స్ టుడే సర్వే ప్రకారం టీఆర్ఎస్ 8 వేల ఓట్లతో గెలుస్తుందని అంచనా వేసింది.
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు 77.55 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. పల్స్ టుడే సర్వే ప్రకారం టీఆర్ఎస్ ఎనిమిది వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో గెలుస్తుందని అంచనా వేసింది.
పల్స్ టుడే సర్వే ప్రకారం...
మునుగోడు ఉప ఎన్నికల్లో పల్స్ టుడే సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 42 నుంచి 43 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. తర్వాత బీజేపీకి 38.5 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. కాంగ్రెస్ కు 14,16 శాతం ఓట్లు వస్తాయని పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీఎస్పీకి మూడు, ఇతరులకు ఒక శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
Next Story