Sun Dec 22 2024 22:10:28 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్మణ్ కు మరో కీలక పదవి
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మరోసారి జరగనుంది. కొన్ని ఖాళీలు ఏర్పడటంతో విస్తరణ ఉంటుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మరోసారి జరగనుంది. కొన్ని ఖాళీలు ఏర్పడటంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది. ఇటవల కేంద్రమంతులుగా ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆర్పీ సింగ్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటున్నారు. కీలక రాష్ట్రాల్లో నేతలకు పదవులు దక్కే అవకాశముంది.
వచ్చే ఏడాది ఎన్నికలు..
వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో మరొకరికి తెలంగాణ నుంచి మంత్రి పదవి లభించనుందన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెంచిన తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో మరొకరికి చోటు కల్పించే అవకాశాలున్నాయి.
Next Story