Sat Nov 23 2024 03:03:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆ 8 జిల్లాలకు వర్షసూచన
భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుఫాను, దాని అనుసంధానంగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతా నేడు తెలంగాణలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురవవచ్చని తెలిపారు. కాగా.. నిన్న వడదెబ్బ కారణంగా వనపర్తి జిల్లాలో ఒకరు, కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో మరొకరు మరణించారు.
Next Story