Fri Jan 10 2025 04:16:56 GMT+0000 (Coordinated Universal Time)
కూతురికి తండ్రి సెల్యూల్... నాన్నా ఇదేంటి?
తాను పనిచేసే చోట కుమార్తె ఐఏఎస్ సాధించి శిక్షణ కోసం అడుగు పెట్టడం అందరినీ ఒక్క క్షణం ఆగిపోయేలా చేసింది
ఏ తండ్రికయినా తన పిల్లలు బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. వారు ఆశించినట్లుగానే, కోరుకున్నట్లుగానే జరగాలని ఆకాంక్షిస్తారు. నిన్న పోలీస్ అకాడమీలో ఒక ఘటన అందరినీ ఆకట్టుకుంది. తాను పనిచేసే చోట కుమార్తె ఐఏఎస్ సాధించి శిక్షణ కోసం అడుగు పెట్టడం అందరినీ ఒక్క క్షణం ఆగిపోయేలా చేసింది. హైదరాబాద్ లోని పోలీస్ శిక్షణలో భాగంగా ప్రొబెషినరీ ఐపీఎస్ లు రాష్ట్ర పోలీసు అకాడమీని సందర్శించారు.
ఇదో గొప్ప అనుభూతి....
అయితే ఆ శిక్షణ పొందడానికి వచ్చిన ఐపీఎస్ లలో ఉమాహారతి కూడా ఉన్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఉమాహారతి తండ్రి వెంకటేశ్వర్లు పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తన కుమార్తెకే పుష్పగుచ్ఛం ఇచ్చి సెల్యూట్ చేశారు. ఉమాహారతి నవ్వుతూ నాన్నా ఇదేంటి? అంటూ వారించబోయినా ఆయన మాత్రం తన విధి నిర్వహణలో భాగంగా చేసినట్లు చెప్పారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story