Mon Dec 23 2024 07:38:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ అర్వింద్ కు రైతుల నిరసన సెగ
ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ చెప్పడం వల్లే వరి వేశాం కాబట్టి.. ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాల..
ఆర్మూర్ : బీజేపీ నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కు మరోసారి రైతుల నిరసన సెగ తగిలింది. రాష్ట్రంలో పండించిన బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈసారి ఏకంగా అర్వింద్ ఇంటినే ముట్టడించారు రైతులు. ఆర్మూర్ లోని అర్వింద్ ఇంటి ముందు వడ్లను పారబోసి నిరసన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు అర్వింద్ ఇంటి వద్దకు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ చెప్పడం వల్లే వరి వేశాం కాబట్టి.. ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్రం యాసంగి పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాల్సిందేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలిసేలా టీఆర్ఎస్ ధర్నా చేసిన విషయం తెలిసిందే. మరికొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేంద్రం పై తదుపరి కార్యాచరణను ఈ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది.
Next Story