Mon Dec 23 2024 19:23:23 GMT+0000 (Coordinated Universal Time)
నిలువునా ముంచిన అకాల వర్షం
నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట అందకుండా పోయింది
నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట అందకుండా పోయింది. అనేక చోట్ల కల్లాలలో ఉన్న ధాన్యం నీటిపాలయింది. కొన్ని చోట్ల మామిడి తోటలు ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపడటంతో రైతులు తీవ్రంగా నష్టోయారు. మిగిలిన పంటలు కూడా వర్షాలతో తడిసి పోవడంతో కొనుగోలు చేస్తారా? లేదా? అన్న ఆవేదనలో రైతన్నలు ఉన్నారు.
పిడుగుపాుటతో ...
పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మెదక్ జిల్లాలోని రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం అనే రైతు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి రైతు మృతి చెందారు.
Next Story