Mon Dec 23 2024 15:09:58 GMT+0000 (Coordinated Universal Time)
ఫీవర్ సర్వే... 4 లక్షల మందికి కోవిడ్ లక్షణాలు
తెలంగాణలో ఫీవర్ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నాలుగు లక్షల మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణలో ఫీవర్ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. దాదాపు నాలుగు లక్షల మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో ఫీవర్ సర్వే జరుగుతుంది. ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యకర్తలు ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అవసరమైన వారికి మెడిసిన్ అందచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు ఫీవర్ సర్వేను చేపట్టింది.
మెడికల్ కిట్లను...
ీఅయిేత ఈ సర్వేలో నాలుగు లక్షల మందికి కోవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరు ఎక్కవుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే వీరెవ్వరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోయినా ఆ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. వీరికి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. అయితే తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో వీరంతా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story