Mon Dec 15 2025 04:13:42 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus : ఉచిత బస్సు పథకం ద్వారా 15 కోట్ల మంది ప్రయాణం.. రికార్డు సృష్టించిన ఆర్టీసీ
ఇప్పటి వరకూ తెలంగాణలో పదిహేను కోట్ల మంది మహిళ ప్రయాణికకులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు

ఆర్టీసీ యాజమాన్యం నేడు పెద్దయెత్తున కార్యక్రమం చేపట్టనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ సంబురాలను నిర్వహించనుంది. మహాలక్ష్మి పథకం పూర్తిగా విజయవంతమయినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ఆర్టీసీ మరో ఘనతను సాధించింది.
నేడు ఆర్టీసీ సంబురాలు....
ఇప్పటి వరకూ తెలంగాణలో పదిహేను కోట్ల మంది మహిళ ప్రయాణికకులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంతో ఈ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ లో కొత్త బస్సులను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు.
Next Story

