Mon Dec 23 2024 09:43:12 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలోకి బాబూ మోహన్
ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు
ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. ఆయనతో కలసి కాసేపు మాట్లాడారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరే అవకాశాలున్నాయి.
అక్కడి నుంచే...
చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా బాబూ మోహన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. బాబూ మోహన్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచే. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఆయన పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం మళ్లీ బీజేపీలో చేరారు. తిరిగి ఆయన టీడీపీలో చేరి క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు.
Next Story