Mon Dec 23 2024 00:43:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టాలివుడ్ లో షూటింగ్ లు బంద్
నేడు టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది.
నేడు టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతికి సంతాప సూచకంగా ఈరోజు చిత్ర పరిశ్రమ అంతా బంద్ పాటించాలని తెలిపింది. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా నివాళులర్పిస్తుంది.
చిత్ర పరిశ్రమకు...
అందుకే నేడు షూటింగ్ లకు సెలవు ప్రకటించింది. రామోజీరావు చిత్ర నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించారు. ఆయన ఫిలింసిటీ నిర్మాణం చేపట్టి ఆసియాలో అతిపెద్ద ఫిలింసిటీని అందుబాటులోకి తెచ్చి తెలుగు వారి చరిత్రను ఇనుమడింప చేశారని చిత్ర పరిశ్రమ తెలిపింది. దీంతో పాటు బుల్లితెర ద్వారా కూడా అనేక మంది కొత్త తరం నటులకుఅవకాశం ఇచ్చింది కూడా రామోజీరావు అంటూ ఆయనకు ఘన నివాళులర్పించేందుకు షూటింగ్ లను బంద్ చేయాలని నిర్ణయించింది.
Next Story