ఇదిగో తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల
తెలంగాణలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల హడావుడి ఎక్కువైపోయింది. ఓవైపు సభలు, రాజకీయ..
తెలంగాణలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల హడావుడి ఎక్కువైపోయింది. ఓవైపు సభలు, రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలు..హామీలపర్వం జోరందుకుంది. మరోవైపు ఎన్నికల ప్రక్రియ అంతకన్నా వేగంగా సాగుతోంది. కొత్త ఓటర్ల నమోదు.. ఓట్ల తొలగింపు.. వివరాల మార్పులు చేర్పులు వంటి దరఖాస్తుల పరిశీలన సజావుగా సాగింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి 3 కోట్ల 17 లక్షల 17వేల 389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
వీరిలో పురుషులు కోటి 58 లక్షల 71 వేల 493 మంది. మహిళా ఓటర్లు కోటి 58లక్షల 43వేల 339 మంది. ఓటరు లిస్ట్‌లో నమోదైన ట్రాన్స్జెండర్ల సంఖ్య 2వేల 557. సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్లు 17 లక్షల వెయ్యి 87 మంది. తొలింగించిన ఓట్లు 4 లక్షల 10 వేలు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది ఎన్నికల కకమిషన్.గత మూడు రోజుల నుంచి ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటిస్తోంది. హైదరాబాద్‌లో మకాం వేసిన సంఘం సభ్యులు అధికారులతో భేటీ అవుతున్నాయి. రాష్ట్ర పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. ఏ సమయంలోనైనా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.