Thu Dec 26 2024 12:22:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నోటిఫికేషన్
తెలంగాణలోని వైద్య ఆరోగ్యశాఖలో 5,348 ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది.
తెలంగాణలోని వైద్య ఆరోగ్యశాఖలో 5,348 ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
ఎన్నికల కోడ్ ఉండటంతో...
అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలలో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి కూడా వివరాలు బయటకు వచ్చాయి. డీఎంఈ కార్యాలయంలో 3,235 పోస్టుల, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255 పోస్టులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, ఆయుష్ విభాగంలో 26, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 11, ఎంఎన్జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పరిధిలో 212 పోస్టులుఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది.
Next Story