Mon Dec 23 2024 08:26:54 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన నిర్మలమ్మ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పర్యటిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడే పుట్టిన బిడ్డపై కూడా లక్ష రూపాయల అప్పు భారం పడుతుందని ఆమె అన్నారు. అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధికి కాకుండా ఇతర ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
తానే ప్రధానినంటూ....
ఉపాధి హామీ పధకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల రూపాయలను పంపిందని చెప్పారు. వాటిని సక్రమంగా ఖర్చు చేయకపోతే అధికారులతో విచారణ జరుపుతామని నిర్మలా సీతారామన్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెడుతూ తనే ప్రధానినంటూ దేశమంతటా తిరుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. తొలుత రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆ తర్వాత దేశం గురించి ఆలోచించాలని నిర్మలా సీతారామన్ హితవు పలికారు.
Next Story