Sun Nov 24 2024 18:17:50 GMT+0000 (Coordinated Universal Time)
తొలి కార్తీక సోమవారం... కిటకిటలాడుతున్న శివాలయాలు
తొలి కార్తీక సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి
తొలి కార్తీక సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాలయానికి వచ్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభమయిన తర్వాత తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించుకుని ప్రార్థనలు చేస్తున్నారు. వేకువ జాము నుంచే ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
నదుల్లో స్నానమాచరించి...
కృష్ణా, గోదావరి నదుల్లో స్నానమాచరించిన అనంతరం శివాలయాలను సందర్శించుకుని దీపాలను వెలిగిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రిలోని పుష్కర్ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువ జాము నుంచే భక్తులు వచ్చి నదిలో స్నానమాచరించి దేవాలయాలను సందర్శించుకోవడం ఈ కార్తీక మాసం ప్రత్యేకత. ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Next Story