Wed Jan 15 2025 11:57:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 67 కు చేరుకున్నాయి
తెలంగాణలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 67 కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన 143 మందికి పరీక్షలు చేయగా వారిలో నలుగురికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
ఆంక్షలు మరింత.....
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చే వారికి క్షుణ్ణంగా పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఆంక్షలను కూడా తెలంగాణ ప్రభుత్వం కఠినతరం చేసింది.
Next Story