Mon Dec 23 2024 10:24:15 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి స్థానికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో..
నిజామాబాద్ జిల్లా శ్రీరామసాగర్ ప్రాజెక్టు (SRSP)కు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 75 టీఎంసీల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 2 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అధికారులు 26 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 34 గేట్లు ఉండగా.. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద తాకిడి పెరిగితే.. మిగతా గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి స్థానికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో.. జలాశయం పూర్తిగా 700 అడుగులు నిండిపోయింది. ప్రాజెక్టులోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. 14 గేట్లను ఎత్తి 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగుగేట్లు మొరాయించడంతో.. ప్రాజెక్టు పై నుంచి వరదనీరు పొంగుతోంది. ఎగువనుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గితే తప్ప.. కడెం ప్రాజెక్టు వద్ద ఈ భయానక పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసనసెగ ఎదురైంది. ప్రాజెక్టు గురించి జిల్లా మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గతేడాది కూడా ఇలా వరదల కారణంగా అపారమైన నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
Next Story