Fri Dec 20 2024 12:13:57 GMT+0000 (Coordinated Universal Time)
వరద ముంచెత్తింది.. అప్రమత్తమయిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. పెద్దవాగు దిగువ భాగం, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు
మంత్రి ఆదేశాలతో...
నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ను ఆదేశించారు.
Next Story