Sat Apr 05 2025 08:04:34 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం
ఆదివారం ఉదయం 9.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గోండియాకు బయల్దేరాల్సిన fly big విమానం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫై బిగ్ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గోండియాకు బయల్దేరాల్సిన fly big విమానం రన్ వే పైకి రాగానే.. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో రన్ వే పైనే విమానం నిలిచిపోయింది. విమానం ఆగిపోవడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. కానీ.. విమానంలో సాంకేతిక లోపానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ప్రయాణికులు రన్ వే పై ధర్నాకు దిగారు. ఉదయం 9.45 గంటలకు ఆగిన విమానం ఇంతవరకూ బయల్దేరకపోవడంపై.. ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఆదివారం ఉదయం నేపాల్ లో మరో విమానం మిస్సైంది. ఉదయం నేపాల్లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ మీడియా తెలిపింది. ముస్తాంగ్ జిల్లాలోని జామ్సన్ గగనతలంలో విమానం చివరిసారిగా కనిపించిందని, ఆ తర్వాత దౌలగిరి పర్వతం వైపు మళ్లిందని తెలిపారు. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని నేపాల్ అధికారులు చెప్పుకొచ్చారు. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు, మరో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. గల్లంతైన విమానం కోసం రెండు ప్రైవేటు హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుపుతున్నారు.
Next Story