Thu Dec 19 2024 05:48:54 GMT+0000 (Coordinated Universal Time)
బలగం మొగిలియ్య ఇక లేరు
తెలంగాణలో జానపద కళాకారుడు మొగిలయ్య మరణించారు. వరంగల్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు
తెలంగాణలో జానపద కళాకారుడు మొగిలయ్య మరణించారు. వరంగల్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. బలగం సినిమా ద్వారా మొగిలయ్య తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచతం. అయితే మొగిలియ్య కు కిడ్నీలు ఫెయిల్ కావడంతో పాటు, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
తన పాటలతో...
మొగిలయ్య తన పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. గుండె సంబంధిత వ్యాధులు కూడా తోడవ్వడంతో మొగిలయ్య మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మొగిలయ్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం కూడా సాయం అందించింది. అలాగే బలగం సినిమా డైరెక్టర్ వేణు కూడా కొంత సాయం అందించారు. ఆయన వరంగల్ లో చికిత్సపొందుతూ మరణించడంతో చిత్రపరిశ్రమలో పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story