Tue Nov 05 2024 13:43:18 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
3 నెలల క్రితమే ఎక్సైరీ డేట్ అయిపోయిన లస్సీని ఇప్పటికీ విక్రయిస్తోంది విజేత సూపర్ మార్కెట్. ఇటీవలే.. లస్సీ పై
కూకట్ పల్లి విజేత సూపర్ మార్కెట్ పై శుక్రవారం హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. సూపర్ మార్కెట్ లోని అన్ని నిత్యావసర వస్తువులను అధికారులు తనిఖీ చేయగా.. కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నట్లు తేలింది. 3 నెలల క్రితమే ఎక్సైరీ డేట్ అయిపోయిన లస్సీని ఇప్పటికీ విక్రయిస్తోంది విజేత సూపర్ మార్కెట్.
Also Read : సమంత సంచలన నిర్ణయం.. ఆ పోస్ట్ డిలీట్ !
ఇటీవలే.. లస్సీ పై ఎక్స్పైరీ డేట్ ను చూసుకోకుండా కొనుగోలు చేసి తాగిన ఓంకేశ్ అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతని ఫిర్యాదుతోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు విజేత సూపర్ మార్కెట్ పై దాడులు నిర్వహించారు. ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులే కాకుండా.. బొద్దింకలు, ఎలుకలు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో ఆ సూపర్ మార్కెట్ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story