Fri Dec 27 2024 04:05:07 GMT+0000 (Coordinated Universal Time)
సందీప్ కిషన్ రెస్టారెంట్ లో తనిఖీలు.. ఏమేమి బయటపడ్డాయంటే?
తెలుగు హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న సంగతి తెలిసిందే
తెలుగు హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'వివాహ భోజనంబు' పేరుతో రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన రెస్టారెంట్ పై ఇటీవల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో అనేక ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్ కు నోటీసులు దాఖలు చేశారు. FSSAI టాస్క్ ఫోర్స్ రెస్టారెంట్ సికింద్రాబాద్ శాఖను తనిఖీ చేసింది. తక్షణమే పరిష్కరించాల్సిన అనేక సమస్యలను గుర్తించింది.
జులై 8న సికింద్రాబాద్లోని వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) టాస్క్ఫోర్స్ తనిఖీల్లో అనేక ఆహార భద్రత ఉల్లంఘనలు బయటపడ్డాయి. గడువు ముగిసిన బియ్యం: 25కిలోల చిట్టిముత్యాలు బియ్యం గుర్తించారు. స్టీల్ కంటైనర్లలో నిల్వ చేసిన పదార్థాలు ఉన్నాయి. సరైన లేబులింగ్ లేదు. కొన్ని డస్ట్బిన్లు మూతలు లేకుండా కనిపించాయి. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. వంటగదిలోని కాలువలలో నీరు నిలిచిపోవడం గమనించారు. ఆహార నిర్వహణదారులు హెయిర్నెట్లు, యూనిఫాంలు ధరించి, పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తించారు. ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డ్లు తాజాగా ఉన్నాయి. తదుపరి చర్యలను నివారించడానికి.. కస్టమర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు వివాహ భోజనంబును ఆదేశించారు.
Next Story