Mon Dec 23 2024 07:57:01 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణ పట్టి ప్రాంతంలో పెద్దపులి సంచారం.. రాబందు కూడా
నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు
నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అది సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించిన అధికారులు స్థానిక గిరిజనులను అప్రమత్తం చేశారు. ట్రాప్ కెమెరాలో పెద్దపులి జాడలు బయటపడినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం డిండి నదిలో నీరు లేకపోవడంతో పెద్దపులి దేవరకొండ నియోజకవర్గంలో నల్లమలకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ పెద్దపులి ప్రతి రోజు నలభై కిలోమీటర్ల మేర సంచరిస్తున్నట్లు తెలిపారు.
కృష్ణపట్టి ప్రాంతంలో...
నల్లమల అటవీ ప్రాంతంలోని కంబాలపల్లి రేంజ్ పరిధితో జంతువులు, నీళ్లు ఎక్కువ కావడంతో ఇక్కడకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాలో పెద్దపులితో పాటు అరుదైన రాబందు కూడా కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం దీనిని గమనించామని చెప్పారు. నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇది కృష్ణపట్టి ఏరియాలో సంచరిస్తుందని చెప్పారు.
Next Story