Thu Dec 19 2024 15:36:23 GMT+0000 (Coordinated Universal Time)
Chanddrababu : కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.
క్యూ కట్టిన నేతలు...
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆయన తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. అంతకు ముందు సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా కేసీఆర్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కేసీఆర్ ను అనేక మంది ప్రముఖులు పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పరామర్శించారు. కేసీఆర్ మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story