Tue Apr 22 2025 22:43:09 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్ట్ వారెంట్ ఉంది. షకీల్ గత కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నారు. తన తల్లి అంత్యక్రియలుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఎయిర్ పోర్టులోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అంత్యక్రియల్లో హాజరు కావడానికి...
అయితే షకీల్ తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరడంతో పోలీసులు అంగీకరించారు. దీంతో హైదరాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్ బయలుదేరారు. అంత్యక్రియలు పూర్తయిన వెంటనే పోలీసులు షకీల్ ను అదుపులోకి తీసుకోనున్నారు. షకీల్ కోసం అనేక నెలలుగా పోలీసులు గాలిస్తున్నారు. ఆయన దుబాయ్ లో ఉండటంతో అరెస్ట్ చేయలేకపోయారు.
Next Story