Sun Dec 22 2024 23:38:01 GMT+0000 (Coordinated Universal Time)
BRS : మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన అధికారులు... 20 కోట్లు చెల్లించాలంటూ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చారు. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న 20 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించాలని కోరుతూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటి వద్ద అధికారులు నోటీసులు అంటించారు.
వరస దెబ్బలు...
ఇటీవల ఆర్టీసీకి చెందిన ప్రాంగణంలో మాల్ నిర్మించిన జీవన్ రెడ్డికి అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. మాల్ కు సంబంధించి అద్దె కోట్ల రూపాయలు బకాయీలు ఉన్నాయని, అవి వెంటనే చెల్లించాలని కోరారు. ఇప్పుడు తాజాగా స్టేట్ ఫైనాన్స్ నుంచి తీసుకున్న రుణాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించాలటూ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
Next Story