Mon Dec 23 2024 04:17:42 GMT+0000 (Coordinated Universal Time)
BRS : గులాబీ కండువా కప్పుకున్న ప్రవీణ్ కుమార్
మాజీ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు
మాజీ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లిన ప్రవీణ్ కుమార్ ను పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.
ఆయనతో పాటు...
ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఎస్పీ నాయకులు కూడా ఈ సందర్భంగా పార్టీలో చేరారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీలోకి తాను చేరడం సంతోషంగా ఉందని ప్రవీణ్ కుమార్ ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, మెతుకు ఆనంద్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్ లు పాల్గొన్నారు.
Next Story