Sun Dec 22 2024 23:10:30 GMT+0000 (Coordinated Universal Time)
KCR : అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ దూరం
ఈరోజు అసెంబ్లీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
ఈరోజు మాత్రం...
బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆయన సభకు హాజరయ్యే అవకాశముంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. తర్వాత ఆయన కాలికి ఫ్రాక్చర్ కావడంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి సమావేశాలు జరుగుతుండటంతో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం ఆయన హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
Next Story