Mon Dec 23 2024 10:06:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉమామహేశ్వరి అంత్యక్రియలు
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు. రెండు రోజుల క్రితం ఆమె బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈరోజు మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు జరుగుతాయని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికాలో ఉండటంతో నేడు అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అందుకోసమే సోమవారం ఆత్మహత్య చేసుకున్నా బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
చిత్ర పరిశ్రమకు...
కాగా ఉమామహేశ్వరి భౌతిక కాయానికి తెలంగాణ మంత్రులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయనేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారు వచ్చి నివాళులర్పిస్తున్నారు. చిన్న కూతురు ఉమామహేశ్వరి అంటే ఎన్టీఆర్ కు ఇష్టమని, ఆమె ఎన్టీఆర్ ఉండగా అందరికీ పరిచయమని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంంంటున్నారు. మరికాసేపట్లో ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Next Story