Mon Dec 23 2024 16:15:15 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ కు ఝలక్.. పార్టీని వీడనున్న నేత
మాజీ సీఎం కుమారుడు జలగం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడనున్నారు. ఆయన నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
మాజీ సీఎం కుమారుడు జలగం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడనున్నారు. ఆయన నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొత్తగూడెం నుంచి 2014లో జలగం వెంకట్రావు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
నేడు ఢిల్లీలో...
ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈసారి టిక్కెట్ జలగం వెంకట్రావుకు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రధాన మైన నేతలు బీఆర్ఎస్ ను వీడారు. జలగం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story