Mon Dec 23 2024 16:38:12 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఇది అప్పుల తెలంగాణగా మార్చేశారు
గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు
గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని అన్నారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని చిదంబరం అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ భృతి కూడా...
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు పర్చలేదని చిదంబరం విమర్శించారు. నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ పర్భుత్వం అప్పు 3.66 లక్షల కోట్లకు చేరుకుందని చిదంబరం తెలిపారు. ప్రతి తెలంగాణ పౌరుడిపై అప్పు లక్షకు చేరుకుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
Next Story