Sun Dec 14 2025 23:33:53 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేటి నుంచి తమిళిసై తెలంగాణలో పర్యటన
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేటి నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేటి నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈరోజు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణలోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ గవర్నర్ గా సుదీర్ఘకాలం పనిచేయడంతో ఆమెకున్న పరిచయాలు ఈ ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ భావిస్తుంది.
సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా...
దీంతో తమిళి సై సౌందర్ రాజన్ ను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. సికింద్రాబాద్ లోనే ఆమె మకాం వేసి అక్కడ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కిషన్ రెడ్డి గెలుపు బాధ్యతలను ఆమె భుజానకెత్తుకుంటున్నారు. దీంతో తమిళి సై సౌందర్ రాజన్ ప్రచారంతో కిషన్ రెడ్డి విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Next Story

