Fri Dec 27 2024 09:28:59 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ తో కుమారస్వామి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. ఉదయం హైదరాబాద్ కు వచ్చిన కుమారస్వామిని మంత్రి కేటీఆర్ రిసీవ్ చేసుకున్నారు. ఆయనతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కుమారస్వామి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు.
జాతీయ రాజకీయాలపై....
జాతీయ రాజకీయాలపై ఇద్దరూ చర్చిస్తున్నారని తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు జాతీయ పార్టీలు దేశానికి ఏడు దశాబ్దాలుగా చేస్తున్నదేమీ లేదని, దక్షిణాదిలో కొత్త పార్టీని ఎలా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న దానిపై కేసీఆర్ కుమారస్వామితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకూ కుమారస్వామి ప్రగతి భవన్ లోనే ఉండనున్నారు.
Next Story